మెదక్ పట్టణంలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంఛిన మెదక్ కెతిడ్రల్ చర్చి 78వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మెదక్ కెతిడ్రల్ చర్చి పెద్దలు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చర్చి వార్షికోత్సవంలో పాల్గొనడం సంతోషకరంగా ఉందని ఆయన పేర్కొన్నారు.