తహసిల్దార్‌కు వీఆర్ఏ కుటుంబీకుల వినతి

75చూసినవారు
మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బుధవారం 61 ప్లస్ వీఆర్ఏ వారసులు తహసిల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. గత ప్రభుత్వం జీవో నెంబర్ 81, 85 ప్రకారం 61 సంవత్సరాల పైబడిన వీఆర్ఏల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈనెల 29న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తహసిల్దార్ లతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 61 సంవత్సరాల పైబడిన వీఆర్ఏల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్