మంజీరా నదిలో చిక్కుకున్న 4గురు వ్యక్తులు

1577చూసినవారు
మంజీరా నదిలో చిక్కుకున్న 4గురు వ్యక్తులు
మెదక్ జిల్లా కొల్చారం మండలం కిష్టపూర్ శివారులోని నలుగురు మంజీర నదిలో చిక్కుకున్న సంఘటన సోమవారం చోటు చేసుకుంది. తహసీల్దార్ ప్రదీప్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం వరద తీవ్రత తగ్గడంతో కిష్టాపూర్ గ్రామానికి చెందిన నలుగురు మంజీరా నది అవతలి ఒడ్డుకి వెళ్లారు. వీరితోపాటు గొర్ల కాపరి కూడా చిక్కుకున్నారు. సమాచారం తెలుసుకున్న అధికారులు సింగూరు గేట్లు మూసివేసి వరద తగ్గించారు. నేడు ఒడ్డుకు చేర్చుతామని తహసీల్దార్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్