ఘనంగా బోనాల పండుగ ఉత్సవాలు

66చూసినవారు
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లిలో బోనాల పండుగ ఉత్సవాలు ఆదివారం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఆషాడ మాసం పురస్కరించుకొని మహంకాళి, పోచమ్మ అమ్మవార్లకు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. మహిళలు బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి గ్రామ దేవతలకు సమర్పించారు. అనంతరం ఒడిబియాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి సంజీవ, గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్