మెదక్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సు సౌకర్యంపై మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడాన్ని నిరసిస్తూ నిరసన నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద కేటీఆర్ ఫ్లెక్సీ దహనం చేసి నిరసన తెలిపారు. ఇప్పటికైనా మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.