మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ మున్సిపల్ కార్యాలయం వద్ద 78వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఛైర్పర్సన్ మామిండ్ల జ్యోతి కృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ నందాల శ్రీనివాస్, కమిషనర్ ఖాజా మొయిజొద్దీన్, కౌన్సిలర్లు, పుర ప్రముఖులు సిబ్బంది తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.