డబుల్ బెడ్రూమ్ ఇళ్లల్లో దొంగల హల్చల్
రామాయంపేట మండల కేంద్రంలోని కేసీఆర్ కాలనీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లల్లో దొంగలు హల్చల్ చేశారు. అర్ధరాత్రి వేళ కాలం వేసిన ఇళ్లను టార్గెట్గా చేసుకున్న దొంగలు తాళాలు ధ్వంసం చేసి సుమారు 8 ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. పలు ఇళ్లల్లో వస్తువులు, వెండి సామాగ్రి ఎత్తుకెళ్లారు. బాధితుల ద్వారా విషయం తెలుసుకున్న రామాయంపేట సీఐ వెంకట్ రాజా గౌడ్, ఎస్సై బాలరాజు విచారణ చేపట్టారు.