గ్యాస్ గోదాంను తనిఖీ చేసిన తహశీల్దార్
వెల్దుర్తి మండల కేంద్రంలోని గ్యాస్ గోదాంలో తహసిల్దార్ కృష్ణ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఇటీవల ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు సిలిండర్ నుండి అక్రమంగా రిఫ్లింగ్ చేస్తున్నారని ఆరోపణల నేపథ్యంలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టి అవినీతి జరిగినట్టు తేలితే తప్పనిసరిగా గ్యాస్ ఏజెన్సీ పై చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ కృష్ణ తెలిపారు.