రోగుల మధ్యనే ఉంటూ వైద్యసేవలందించే విద్యార్థులకు పలుచోట్ల కనీస వసతులు ఉండటం లేదు. అనారోగ్య పరిస్థితుల్లో కూడా 36 నుంచి 60 గంటల వరకూ విధులను నిర్వహిస్తున్నారు. దీంతో మరుగుదొడ్డిలోనే స్నానం చేయాల్సిన పరిస్థితులున్నాయని.. లేదంటే 36 గంటల డ్యూటీ అనంతరం ఇళ్లకు వెళ్లి స్నానం చేయాల్సి వస్తోందని పలువురు విద్యార్థులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో బాత్‌రూంలు, మరుగుదొడ్లు కూడా సక్రమంగా లేక ప్రధానంగా విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.