ఏపీ, తెలంగాణ విభజనకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న పెండింగ్ అంశాలపై రేపు (సోమవారం) రెండు రాష్ట్రాల అధికారుల కమిటీ భేటీ కానుంది. ఏపీలోని మంగళగిరి APIIC కార్యాలయంలో జరిగే ఈ భేటీలో రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై చర్చించనున్నారు. రెండు రాష్ట్రాల సీఎస్ ల నేతృత్వంలో అధికారుల కమిటీ సమావేశం జరగనుంది.