గ్రేటర్ HYD పరిధిలోని BRS ఎమ్మెల్యేలతో భేటీ అనంతరం కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సమస్యలకు కేరాఫ్‌గా హైదరాబాద్ మారిందని చెప్పారు. సమస్యల పరిష్కారం, నగర ప్రజలకు కలిగించాల్సిన భరోసాపై ఎమ్మెల్యేలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. నగర పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో పారిశుధ్య ఇబ్బందులు, తాగునీటి సమస్య పరిష్కారానికి BRS కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ హామీలు అమలు చేసేవరకు BRS పోరాడుతుందన్నారు.