తుర్కియేలోని బోలు ప్రావిన్స్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఓ స్కీ రిసార్ట్‌లోని హోటల్‌లో చెలరేగిన మంటల కారణంగా ఈ ప్రమాదం సంభవించింది. అయితే ఈ ఘటనలో 66 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరో 51 మందికి గాయాలయ్యాయని వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.