పుష్ప-2 మూవీకి మెగా హీరో విషెస్

55చూసినవారు
పుష్ప-2 మూవీకి మెగా హీరో విషెస్
అల్లు అర్జున్‌ హీరోగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప 2’ భారీ అంచనాలతో రిలీజ్‌కు సిద్ధమైంది. అయితే ఈ సినిమా గురించి మెగా కుటుంబం నుంచి ఎవరూ మాట్లాడట్లేదని నెట్టింట చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ 'పుష్ప-2' టీమ్‌కు విషెస్ తెలిపారు. 'అల్లు అర్జున్, సుకుమార్ & టీమ్‌కు నా హృదయపూర్వక బ్లాక్ బస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా' అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, ఈరోజు రాత్రి నుంచి 'పుష్ప-2' ప్రీమియర్స్ మొదలు కానున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్