మెగా ఇంట సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. ఈ సంక్రాంతి మెగా ఫ్యామిలీకి చాలా స్పెషల్. రామ్ చరణ్-
ఉపాసన దంపతులకు క్లింకార జన్మించడం, వరుణ్ తేజ్-లావణ్యల వివాహం తర్వాత వచ్చిన పండుగ కావడంతో ఇంటిల్లిపాది ఇప్పటికే బెంగళూరులోని ఫామ్‌హౌజ్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో వారంతా కలిసి చేసి హడావుడి ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ దోశలు వేయడం, వైష్ణవ్ తేజ్ బర్త్ డే వీడియోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.