మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. అనిల్ రావిపూడి స్వయంగా ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించాడు. సినిమాలో చిరంజీవి 'శంకర్ వర ప్రసాద్' పాత్రలో కనిపించనున్నారని, ఈ క్యారెక్టర్‌ను పరిచయం చేయగా, చిరు ఎంతో ప్రేమతో ఆ పాత్రను స్వీకరించారని తెలిపారు. ఇక మరింత ఆలస్యం చేయకుండా షూటింగ్‌ను ప్రారంభిద్దామంటూ చిరంజీవి సూచించారని అనిల్ చెప్పారు.