TG: ప్రభుత్వ స్కూళ్లలో 6 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారని బీజేపీ శాసన సభ్యులు పైడి రాకేశ్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. పదేళ్లలో 6వేల స్కూళ్లు మూతపడ్డాయన్నారు. వసతుల్లేని ప్రభుత్వ బడులకు విద్యార్థులు ఎందుకెళ్లాలని ప్రశ్నించారు. అందుకే పేరెంట్స్ అప్పుచేసి ప్రయివేటు బడులకు పిల్లలను పంపిస్తున్నారన్నారు. విద్యారంగానికి 15 శాతం నిధులను కేటాయించాల్సి ఉండగా.. ఈ బడ్జెట్లో 7.57 శాతం నిధులనే కేటాయించిందని తెలిపారు.