బహిరంగ సభ తర్వాత సభ్యత్వ నమోదు: కేటీఆర్

54చూసినవారు
బహిరంగ సభ తర్వాత సభ్యత్వ నమోదు: కేటీఆర్
వరంగల్ బహిరంగ సభ తర్వాత డిజిటల్ పద్ధతిలో విద్యార్థి, కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అనంతరం అధ్యక్ష ఎన్నిక జరుగుతుందన్నారు. రాష్ట్ర కమిటీలతో పాటు జిల్లా కమిటీలను, ఇతర కమిటీలను వేస్తామని తెలిపారు. ఆ తర్వాత జిల్లాల వారీగా కార్యకర్తల శిక్షణ సమావేశాలు ఉంటాయన్నారు. ప్రతినెల ఒక్కొక్క కార్యక్రమాన్ని నిర్వహించేలా 12 నెలల పాటు కొనసాగేలా ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని చెప్పారు.

సంబంధిత పోస్ట్