ఎప్పటికైనా బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమవడం ఖాయమని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్కు నలుగురు రాజ్యసభ సభ్యులున్నారని గుర్తు చేసిన ఆయన.. విలీనం అయిన వెంటనే కవితకు బెయిల్ వస్తుందని, ఆ తర్వాత కేసీఆర్ గవర్నర్, కేటీఆర్ సెంట్రల్ మినిస్టర్, హరీశ్ రావు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ అవుతారని జోస్యం చెప్పారు.