భవిష్యత్తులో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం: లక్ష్మణ్

56చూసినవారు
భవిష్యత్తులో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం: లక్ష్మణ్
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేత లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆగస్టులో సంక్షోభం తప్పదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమలు కానీ హామీలు ఇచ్చారని మండిపడ్డారు. రేవంత్ కూడా కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారని, గ్యారంటీల అమలు కోసం విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమవుతుందని లక్ష్మణ్ జోస్యం చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్