బంగ్లాదేశ్ లో ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ చెలరేగిన హింస తీవ్రరూపం దాల్చింది. తాజా హింస నేపథ్యంలో ఆర్మీ హెచ్చరికలతో ప్రధాని పదవికి హసీనా రాజీనామా చేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో బంగ్లాలో ప్రభుత్వ ఏర్పాటుకు సైన్యం సిద్ధమైంది. లా అండ్ ఆర్డర్ మొత్తం సైన్యం చేతుల్లోకి వెళ్లిపోయింది. త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆ దేశ ఆర్మీ చీఫ్ వాకర్-ఉజ్-జమాన్ తెలిపినట్లు రాయిటర్స్ నివేదించింది.