పాస్టర్ ప్రవీణ్ మృతి పట్ల మంత్రి లోకేశ్ విచారం

50చూసినవారు
పాస్టర్ ప్రవీణ్ మృతి పట్ల మంత్రి లోకేశ్ విచారం
AP: ప్రముఖ పాస్టర్ పగడాల ప్రవీణ్ రాజమండ్రిలో అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మృతి పట్ల మంత్రి లోకేశ్ 'ఎక్స్' వేదికగా విచారం వ్యక్తం చేశారు. 'ఆయన మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయిస్తామని' పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్