బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలోని మహిళలపై జరిగిన దాడుల వివరాలను మహిళా కమిషన్‌కు కేటీఆర్ అందించాలని మంత్రి సీతక్క కౌంటర్ వేశారు. 2014-23 వరకు మహిళలపై జరిగిన దాడుల వివరాలు తన వద్ద ఉన్నాయని, కావాలంటే కేటీఆర్‌కు ఆ డాటా ఇస్తానని చెప్పారు. తాము సైతం మహిళా కమిషన్‌ను కలుస్తామని, బీఆర్ఎస్ పాలనలో మహిళలపై జరిగిన దాడుల వివరాలను అందిస్తామని వెల్లడించారు.