గీత దాటితే వేటు తప్పదని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మద్యం, ఇసుక విధానంలో జోక్యం చేసుకుంటున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో ఆయన సీరియస్ అయ్యారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇసుక వ్యవహారంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని సూచించారు. ఇసుక దందా చేసే వారిపై ప్రజలు తిరుగుబాటు చేయాలని పిలుపునిచ్చారు. మద్యం ఎమ్మార్పీ కంటే ఎక్కువగా అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు.