తెలంగాణలో చిన్నారులు, పేద పిల్లలు, బాలింతలు, గర్బిణీల ఆరోగ్యంపై రాష్ట్ర సర్కారు ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే నాచారంలోని రాష్ట్ర ఫుడ్స్ కార్యాలయం, కర్మాగారాన్ని మంత్రి సీతక్క ఆకస్మిక తనిఖీ చేశారు. అంగన్వాడి కేంద్రాలకు బాలామృతంతో సహా పలు రకాల ఆహార వస్తువులను సరఫరా చేస్తున్న టీజీ ఫుడ్స్ ను పరిశీలించారు. ఆహార పదార్థాల నాణ్యతను, పరిసరాల పరిశుభ్రతను చెక్ చేశారు. పౌష్టికాహారంపై సిబ్బందితో పలు విషయాలపై చర్చించారు.