ఇండోర్‌ను సందర్శించనున్న అమిత్ షా

83చూసినవారు
ఇండోర్‌ను సందర్శించనున్న అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా జులై 14న ఇండోర్‌లో పర్యటించనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 29 స్థానాలను గెలుచుకున్న తర్వాత రాష్ట్రంలో తొలిసారి ఆయన పర్యటిస్తున్నారు. ఇండోర్‌లోని ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీలో ‘ప్రైమ్ మినిస్టర్ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్’ని ఆయన ప్రారంభిస్తారు. మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం 55 ‘పీఎం ఎక్సలెన్స్ కాలేజీలను’ ప్రారంభించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్