లారీని ఢీకొట్టిన స్కూల్ బస్సు.. 11 మంది విద్యార్థులకు గాయాలు

81చూసినవారు
లారీని ఢీకొట్టిన స్కూల్ బస్సు.. 11 మంది విద్యార్థులకు గాయాలు
AP: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు వద్ద విహారయాత్రకు వెళ్లి వస్తున్న ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 మంది విద్యార్థులకు తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడ్డవారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డవారు కృష్ణా జిల్లాకు చెందిన విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్