AP: కూటమి సర్కారు శుభవార్త చెప్పింది. గిరిజన ప్రాంతాల్లో కొత్తగా 139 అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణానికి, మరో 40 కేంద్రాల మరమ్మతులకు కేంద్రం రూ.20.82 కోట్లు మంజూరు చేసింది. ఏపీలోని 5 జిల్లాల పరిధిలో ఉండే గిరిజన ప్రాంతాల్లో ఒక్కో కేంద్రాన్ని రూ.15 లక్షలతో నిర్మించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న948 అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని నిర్ణయించింది.