AP: జగన్ మినహా మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు జీతం తీసుకుని అసెంబ్లీకి వచ్చి హాజరుపట్టిలో సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. అయితే జగన్ ఎక్కువగా అసెంబ్లీకి రావడం లేదనే విషయం తెలిసిందే. అందుకే ఆయన జీతం కూడా తీసుకోవట్లేదట. తాజాగా వైసీపీ ఎమ్మెల్యేలు సైతం జగన్ తరహాలోనే జీతం తీసుకోకూడదని నిర్ణయించుకున్నారట. త్వరలో దీనిపై అధికార ప్రకటన చేసే అవకాశం ఉంది.