భార్యకు ఎంపీ టి​కెట్‌ ఇవ్వలేదని ఎమ్మెల్యే రాజీనామా!

443942చూసినవారు
భార్యకు ఎంపీ టి​కెట్‌ ఇవ్వలేదని ఎమ్మెల్యే రాజీనామా!
అసోం రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. తన భార్యకు సీటవ్వలేదని ఓ ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేశాడు. లఖింపూర్ జిల్లాలోని నౌబోయిచా నియోజకవర్గ ఎమ్మెల్యే భరత్ చంద్ర నారా.. తన భార్యకు లోక్‌సభ టికెట్ నిరాకరించడంతో తక్షణమే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 19న ఇక్కడ లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. కాగా ఆయన భార్య రాణీ నారా గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు.

సంబంధిత పోస్ట్