యువకుడిని చెంపదెబ్బ కొట్టిన MLA (వీడియో)

190029చూసినవారు
బీహార్‌లోని భాగల్‌పూర్‌లో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. ఇండస్ట్రియల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీరో మైల్ స్క్వేర్ ప్రాంతంలో ఓ వృద్ధుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. వృద్ధుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు రహదారిపై రాస్తారోకో చేశారు. అక్కడికి జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ వచ్చారు. మృతుడి కుటుంబ సభ్యుల్లో ఒకరితో ఆయనకు వాగ్వాదం జరిగింది. విచక్షణ కోల్పోయి ఆ యువకుడిని ఎమ్మెల్యే చెంపదెబ్బ కొట్టారు.

సంబంధిత పోస్ట్