MLC ఉప ఎన్నిక అప్డేట్.. రెండో రౌండ్ కౌంటింగ్ పూర్తి

73చూసినవారు
MLC ఉప ఎన్నిక అప్డేట్.. రెండో రౌండ్ కౌంటింగ్ పూర్తి
నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రెండు రౌండ్ల తర్వాత 1.92 లక్షల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి అయింది. మొదటి రౌండ్ పోల్చుకుంటే రెండవ రౌండ్ లో తీన్మార్ మల్లన్నకు మెజారిటీ తగ్గింది. రెండు రౌండ్స్ ముగిసే సరికి 14 వేల పై చిలుకు మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మూడో రౌండ్ కౌంటింగ్ ప్రారంభమైంది.

సంబంధిత పోస్ట్