TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ బిల్లుపై ఆయనతో చర్చించారు. సభలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని కోరిన మల్లన్న, బీసీల హక్కులను రక్షించే దిశగా కృషి చేయాలని అభిప్రాయపడ్డారు. జంతర్ మంతర్ లో దీక్షకోసం ప్రభుత్వాన్ని, సిఎంపై ఒత్తిడి తేవాలని కోరారు. ఈ భేటీలో మాజీ మంత్రి హరీశ్ రావు ఉన్నారు.