హిమచల్‌లో ఆ గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం

66చూసినవారు
హిమచల్‌లో ఆ గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమచల్‌ప్రదేశ్‌లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా గ్రామస్థులతో ప్రధాని మోదీ 13 నిమిషాలకు పైగా మొబైల్‌లో ముచ్చటించారు. గీవులో మొబైల్ సేవలు ప్రారంభంకావటంతో గ్రామస్థులందరూ ఆనందంలో మునిగిపోయారు. గతంలో మొబైల్ వాడుకోవడానికి 8 కి.మీ ప్రయాణించాల్సి వచ్చేదని గుర్తుచేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్