ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ హత్యకు కుట్ర

53చూసినవారు
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ హత్యకు కుట్ర
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలన్ స్కీ హత్యకు కుట్ర పన్నిన పావెల్ కే అనే వ్యక్తిని పోలాండ్‌లో అరెస్ట్ చేశారు. పోలాండ్ జాతీయుడైన పావెల్.. రష్యన్ మిలిటరీ ఇంటెలిజెన్స్‌కి సమాచారం అందించాడని, జెలన్ స్కీని హత్య చేయడానికి ప్లాన్ చేశాడని, ఇందుకు రష్యా ప్రత్యేక దళాలు సాయం చేసినట్లు వెల్లడించారు. అతను పోలాండ్‌లో ర్జెస్జో జిసియోంకా విమానాశ్రయంలోని భద్రతా వివరాలను సేకరించి రష్యాకు అందించినట్లు అనుమానిస్తున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్