AP: కూటమి ప్రభుత్వం ప్రభుత్వం ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయ బదిలీ చట్టంపై క్షేత్ర స్థాయిలో అభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. జీవో 117 ఉపసంహరణ అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం అని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్లూ ప్రింట్ ప్రవేశపెట్టనున్నట్లు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తాజాగా వెల్లడించారు.