ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ వినిపించింది. గతేడాది ఆగస్టు- సెప్టెంబర్‌లో వరదలకు దెబ్బతిన్న ఆటోలకు పరిహారం పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తొలుత రూ. 10 వేల పరిహారం ఇవ్వగా.. తాజాగా వాటిని రూ. 20 వేలకు పెంచుతూ సంబంధిత శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలను ఏమీ పట్టించుకోకుండా బాధితులకు పరిహారం ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.