NDA ప్రభుత్వంలో మోదీ పాత్ర నామమాత్రమే: కాంగ్రెస్

55చూసినవారు
NDA ప్రభుత్వంలో మోదీ పాత్ర నామమాత్రమే: కాంగ్రెస్
బీజేపీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ప్రధాని మోదీపై కాంగ్రెస్ పార్టీ సెటైరికల్ పోస్టులతో విరుచుకుపడుతోంది. ‘ఈసారి NDA ప్రభుత్వంలో మోదీ పాత్ర నామమాత్రమే. స్టీరింగ్ చంద్రబాబు, నితీశ్ చేతుల్లోనే’ అని అర్థం వచ్చేలా తాజాగా ఓ సెటైరికల్ ఫొటోను పోస్ట్ చేసింది. అందులో ఆటోను చంద్రబాబు డ్రైవింగ్ చేస్తున్నట్లు ఉండగా వెనకాల మోదీ దిగులుగా ఉన్నారు.దీనికి ‘400 పార్ రవాణా సేవలు’ అని క్యాప్షన్ ఇచ్చింది.

సంబంధిత పోస్ట్