బంగ్లా మధ్యంతర ప్రభుత్వ హెడ్‌గా మహ్మద్ యూనస్

80చూసినవారు
బంగ్లా మధ్యంతర ప్రభుత్వ హెడ్‌గా మహ్మద్ యూనస్
నోబెల్ అవార్డు గ్రహీత మహ్మద్ యూనస్‌ను బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ హెడ్‌గా నియమిస్తున్నట్లు ప్రెసిడెంట్ ప్రెస్ సెక్రటరీ వెల్లడించారు. 84 ఏళ్ల యూనస్ బంగ్లాదేశ్‌లో గ్రామీణ బ్యాంకును నెలకొల్పి ఎంతోమందిని పేదరికం నుంచి బయటపడేశారు. షేక్ హసీనాకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నారు. ఆయన అమెరికాకు అనుకూలంగా ఉంటారని పేరుంది. ఈ క్రమంలో భారత్‌తో యూనస్ ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

సంబంధిత పోస్ట్