కొడుకు మరణవార్త విని తల్లి కూడా కుప్పకూలి చనిపోయిన ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. లింగంపల్లికి చెందిన మ్యాకల శ్రీశైలం(34) గత నెల 24న పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా.. శుక్రవారం చికిత్స పొందుతూ చనిపోయారు. శ్రీశైలం మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే అతని తల్లి వెంకటమ్మ (52) కూడా కొడుకు శవం వద్ద కుప్పకూలి మృతి చెందింది. దీంతో తల్లీ కొడుకుల అంత్యక్రియలను గ్రామస్థులు ఒకేసారి నిర్వహించారు.