అమూల్‌ బాటలోనే మదర్‌ డెయిరీ.. లీటరు పాలపై రూ.2 పెంపు

50చూసినవారు
అమూల్‌ బాటలోనే మదర్‌ డెయిరీ.. లీటరు పాలపై రూ.2 పెంపు
ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ మ‌ద‌ర్ డెయిరీ మ‌ళ్లీ పాల ధ‌ర‌లు పెంచేసింది. అన్ని రకాల ఉత్పత్తుల ప్రస్తుత ధరపై రూ.2 మేర పెంచినట్లు మదర్‌ డెయిరీ సోమవారం తెలిపింది. గత 15 నెలలుగా ఇన్‌పుట్ కాస్ట్ పెర‌గ‌డంతో పాల ధ‌ర‌లు పెంచ‌క త‌ప్పలేద‌ని పేర్కొంది. పెరిగిన ధరలు దేశవ్యాప్తంగా సోమవారం నుంచే (జూన్‌ 3) అమల్లోకి వస్తాయని తెలిపింది. మరోవైపు గుజరాత్‌కు చెందిన పాల కంపెనీ అమూల్‌ పాల ధరలను పెంచేసిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్