ఢిల్లీలోని మంగోల్‌పూర్ లో తాజాగా దారుణ ఘటన జరిగింది. ఆస్తి కోసం వితంతువైన తల్లీ మరియు చెల్లెళ్లను కొడుకులు తీవ్రంగా కొట్టారు. కనికరం లేకుండా కిందపడేసి కాలితో తన్ని మరీ కొట్టారు. కొట్టవద్దు అని ఎంత ప్రాధేయపడినా వదల్లేదు. వారిని తీవ్రంగా కొట్టి ఇంటి నుంచి వెళ్లగొట్టినట్లు తెలుస్తోంది. బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు అమిత్ రాఠి, శరద్ రాఠి, నీరజ్, సుమన్ మరియు సోనులపై పోలీసులు వారం రోజులైనా కేసు నమోదు చేయలేదని తెలుస్తోంది.