మద్యం మత్తులో గొడవ.. యువకుడి మృతి

76చూసినవారు
మద్యం మత్తులో గొడవ.. యువకుడి మృతి
AP: అనంతపురం నగరంలో షాకింగ్ ఘటన జరిగింది. అక్కడి కోర్టు రోడ్డులోని ఓ బిర్యానీ సెంటర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. గణేశ్‌, శ్రీధర్‌, నూర్‌ మహ్మద్‌ అనే ముగ్గురు యువకులు గత కొంతకాలంగా పని చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం మద్యం మత్తులో మాటామాటా పెరిగి గొడవ పడ్డారు. ఈ క్రమంలో నూర్‌ మహ్మద్‌ తలకు బలంగా గాయమై అక్కడికక్కడే కూలిపోయాడు. ఆతని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్