పల్నాడు జిల్లాలోని అంగన్వాడీ టీచర్‌పై టీడీపీ నేత బొడ్డు వెంకటేశ్వరరావు లైంగిక వేధింపులకు పాల్పడడం కలకలం రేపింది. సత్తెనపల్లి మండలం కంకణాలపల్లిలో స్వర్ణలత అనే మహిళ అంగన్వాడీ టీచర్‌గా విధులు నిర్వహిస్తుంది. ఇటీవల తన భర్త చనిపోతే రూ.5 లక్షలు ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పిస్తానని రూ.లక్ష తీసుకున్నారని బాధితురాలు ఆరోపించింది. అలాగే కోరిక తీర్చమని వేధిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.