మా ట్రాక్టర్లే ఆపుతారా అంటూ ఎమ్మార్వో ఆఫీసుకు తాళం

57చూసినవారు
మా ట్రాక్టర్లే ఆపుతారా అంటూ ఎమ్మార్వో ఆఫీసుకు తాళం
తెలంగాణలో జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం చిల్పూర్ గుట్టలో అక్రమ మైనింగ్ రవాణాను ప్రశ్నించినందుకు, ఎమ్మార్వో కార్యాలయానికి తాళం వేసి, సిబ్బందిపై దాడికి ప్రయత్నించారు ముగ్గురు ట్రాక్టర్ డ్రైవర్లు. ఆర్ఐ చీకటి వినీత్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు ట్రాక్టర్లను ఆపి, మట్టి అనుమతితో తరలిస్తున్నారా? అని ప్రశ్నించడంతో ఈ గొడవ మొదలైంది. పోలీసులు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్