కోల్‌కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి 12.40 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు పెద్దఎత్తున ఆసుపత్రిలోకి ప్రవేశించి ఆస్పత్రికి సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేశారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేసి, టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.