మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇప్పటి వరకు 8.5 కోట్ల మందికి పైగా భక్తులు పవిత్ర సంగమంలో స్నానాలు చేశారు. అయితే ఈ మహాకుంభమేళాకు ఒడిశాకు చెందిన రఫీక్ అనే ముస్లిం వ్యక్తి స్నానం ఆచరించాడు. ఒడిశాలో టీ షాపు నిర్వహిస్తున్న అతను.. తన షాపునకు వచ్చిన వాళ్లంతా మహాకుంభమేళా గురించి గొప్పగా మాట్లాడుకుంటుంటే వినేవాడు. దీంతో ఎలాగైనా మహాకుంభమేళాకు వెళ్లాలని నిర్ణయించుకొని వచ్చినట్లు తెలిపాడు.