నా భర్త ఇంకో అమ్మాయిని ప్రేమించాడు: స్నేహ

1564చూసినవారు
నా భర్త ఇంకో అమ్మాయిని ప్రేమించాడు: స్నేహ
తెలుగు సినీ పరిశ్రమకు దొరికిన అచ్చ తెలుగు హీరోయిన్లలో స్నేహ ఒక్కరు. తమిళ సినీ నటుడు ప్రసన్నను 2012లో ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. తాజాగా తన భర్త ప్రసన్న గురించి ఆమె ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. గతంలో తన భర్త మరో అమ్మాయిని ప్రేమించాడని, కానీ వారికి బ్రేకప్ అయిందని చెప్పారు. ఆ ప్రేమ వల్ల తనకు ఎలాంటి సమస్య లేదని, వారు బ్రేకప్ కాకపోతే ప్రసన్న తనకు భర్తగా దొరికే వాడు కాదని అన్నారు.

సంబంధిత పోస్ట్