భారతదేశంలోని ఆలయాల్లో కొన్ని రహస్యాలకు నెలవు. అలాంటి ఆలయమే రాజస్థాన్ ధోల్ పూర్ లోని ‘అచలేశ్వర్ మహాదేవ్’ ఆలయం. ఇక్కడి శివలింగం రోజుకు మూడుసార్లు రంగులు మారి కనిపిస్తుంది. ఉదయం ఎర్రగా, మధ్యాహ్నం కాషాయ రంగు, సాయంత్రం నీలం రంగులోకి మారి, భక్తులకు దర్శనమిస్తుంది. దీనిపై చాలా మంది పరిశోధనలు చేసినా ఇప్పటివరకూ ఇది మిస్టరీగానే మిగిలిపోయింది. ముఖ్యంగా శ్రావణ మాసం, శివరాత్రి పర్వదినాల్లో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు.