ఆఫ్రికా తీరంలో ఆగ్నేయ హిందూ మహాసముద్రంలోని మాయోట్ ద్వీపకల్పంలో ఛీడో తుఫాను బీభత్సం సృష్టించింది. ఈ తుపాను ప్రభావం వల్ల ఇప్పటికి 11 మందికిపైగా మరణించగా, సుమారు 246 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణాల సంఖ్య వెయ్యి వరకు ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మాయోట్‌లో గత 90 ఏళ్లలో ఇలాంటి తుఫాను రావడం ఇదే మొదటిసారని అధికారులు పేర్కొంటున్నారు.