మహాశివరాత్రి పర్వదినం వేళ నాగసాధువులు కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకున్నారు. శైవ సాంప్రదాయానికి చెందిన ఏడు అఖాడాలు.. గంగా ఘాట్ల నుంచి విశ్వనాథుడి ఆలయానికి ఊరేగింపు నిర్వహించాయి. ఆ సమయంలో నాగ సాధువులు భారీ ప్రదర్శన ఇచ్చారు. శరీరానికి విభూతి రాసుకుని, మెడలో పూలమాలలతో శివనామస్మరణ చేస్తూ ర్యాలీ చేశారు. చేతుల్లో త్రిశూలాలు, గదలు పట్టుకుని విన్యాసాలు చేశారు.